Monday, April 29, 2024

లోక్‌సభలో ఎంపి బిధూరీ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ముంబై : పార్లమెంట్ సమావేశాల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ ఆదివారం మండిపడ్డారు. లోక్‌సభలో సాటి ఎంపిపై అధికార పార్టీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై దేశమంతా రాజకీయ దుమారం రేపింది.

“ లోక్‌సభ సభ్యుడు ఒకరు మరొక సభ్యుడిని ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా సంభోధించారు. అంతటితో ఆయన ఆగలేదు. ఆయన మతం, కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి దుర్భాష ప్రతిపక్ష ఎంపిపై మాట్లాడొచ్చా ? అదే స్థానంలో నేనున్నా అంతేనా ? అని రౌత్ వ్యాఖ్యానించారు. “ ఇది చాలా తప్పు. అలాంటి వ్యక్తి పార్లమెంట్‌లో ఉండకూడదు. కొత్త పార్లమెంట్ పవిత్రతను, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతిసభ్యునిపైనా ఉంది.

” అని రౌత్ విలేఖరుల ఎదుట మాట్లాడారు. ఈ సంఘటన తరువాత బిధూరీ, అలీ ఎంపీలు ఇద్దరూ బీజేపీ, విపక్షాల ప్రచారాంశాలుగా మారారన్న వ్యాఖ్యలను రౌత్ తోసిపుచ్చారు. “ ప్రతివారికి పార్లమెంట్ నిబంధనలు ఒకేలా ఉండాలి. మీరు (పాలక వర్గాన్ని ఉద్దేశించి) ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, రజనీ పటేల్‌లను సస్పెండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ అధిత్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేశారు. కానీ బిధూరికి మాత్రం కేవలం నోటీస్ పంపారు” అని రౌత్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News