Wednesday, May 8, 2024

ఎస్‌బిఐ అమరావతి సర్కిల్ సేవా కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

SBI Amaravati circle Service Programs

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎస్‌బిఐ అమరావతి సర్కిల్ సిఎస్‌ఆర్(కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది. దీన్ దయాల్ శ్రావణ ఫౌండేషన్‌ విజయవాడ వారికి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్(ఆర్ అండ్ డిబి) చల్లా శ్రీనివాసులు శెట్టి 300 హియరింగ్ మెషిన్లను విరాళంగా ఇచ్చారు. ఇంకా వన్యప్రాణుల సంరక్షణ కోసం వరల్డ్‌వైడ్ ఫండ్‌కు రెండు సోలార్ డీప్ వెల్ పంపింగ్ సిస్టమ్‌లను, అలాగే గుంటూరు శ్రీ షిర్డీ సాయి సేవా ట్రస్ట్‌కు రేడియోగ్రఫీతో ఎక్స్‌రే యంత్రాన్ని కూడా ఆయన అందజేశారు. అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ విన్సెంట్ ఎండి మాట్లాడుతూ, ఎస్‌బిఐ రాష్ట్రవ్యాప్తంగా సిఎస్‌ఆర్ యాక్టివిటీస్‌లో భాగంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News