Sunday, April 28, 2024

56 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులకు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు 56 మంది న్యాయవాదులకు పదోన్నతి కల్పించింది. మొత్తం 56 మది లాయర్లు, అడ్వకేట్ ఆన్ రికార్డు (ఎఒఆర్)లను సీనియర్ లాయర్లుగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టుకు చెందిన జడ్జిల పూర్తిస్థాయి సమావేశం ఇదేరోజు జరిగింది. ఇందులో లాయర్లను సీనియర్ లాయర్లుగా ఎంపిక చేసే నిర్ణయం తీసుకున్నారని , ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వచ్చిందని ఎగువ కోర్టు నోటిఫికేషన్ వెలువరించింది.

సీనియర్ న్యాయవాదులతో పాటు సుప్రీకోర్టు ఇప్పుడు 198 మంది లాయర్లను సుప్రీంకోర్టు ఆన్‌రికార్డు లాయర్లుగా నియమించింది. వీరికి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభినందనలు తెలిపారు. రాజ్యాంగంలోని 145వ అధికరణం మేరకు సుప్రీంకోర్టులో ఏదైనా వ్యాజ్యం దాఖలు చేసే అధికారం కేవలం సుప్రీంకోర్టు నియమిత అధీకృత లాయర్లకే ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు సంబంధిత ఎఒఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి జరిగిన పరీక్షల్లో పలువురు మహిళా న్యాయవాదులు ఉత్తీర్ణులు కావడం హర్షదాయకం అని చీఫ్ జస్టిస్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News