Thursday, May 2, 2024

తేజ్‌పాల్ పై కేసు విచారణ గడువు మార్చి 31 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

SC extended hearing of Sexual assault case against Tejpal till March 31

 

న్యూఢిల్లీ: తెహల్కా వార్తాపత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌పై దాఖలైన లైంగిక దాడి కేసు విచారణను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనంమంగళవారం విచారణ చేపట్టింది. కేసు విచారణ గడువును పొడిగించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అభ్యర్థించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకురాగా ఇంకా సాక్షులను విచారించాల్సి ఉన్నందున విచారణ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తన మాజీ మహిళా సహోద్యోగిపై తరుణ్ తేజ్‌పాల్‌పై 2013లో గోవాలోని ఒక హోటల్ లిఫ్టులో లైంగిక దాడి జరిపినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తేజ్‌పాల్ అప్పట్లోనే ఖండించారు. 2013 నవంబర్ 30న తేజ్‌పాల్‌ను గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2014 మే నుంచి ఆయన జామీనుపై ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News