Thursday, May 2, 2024

మమత పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నారద స్టింగ్ టేపు కేసులో నలుగురు టిఎంసి నాయకులను అరెస్టు చేసే సందర్భంగా సిబిఐ అధికారులను అడ్డుకున్నారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్ దాఖలు చేసిన అప్పీళ్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ తప్పుకున్నారు. మంగళవారం మమతా బెనర్జీ, ఘటక్ దాఖలు చేసిన అప్పీళ్లు విచారణకు రాగా ఈ విచారణ నుంచి జస్టిస్ బోస్ తనకు తానుగా తప్పుకుంటున్నారని మరో న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా ప్రకటించారు. ఈ పిటిషన్లపై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి తెలియచేస్తామని, దీనిపై తుది నిర్ణయం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తీసుకుంటారని జస్టిస్ గుప్తా కోర్టులో తెలిపారు.
మే 17వ తేదీన నారదా కుంభకోణం కేసులో నలుగురు టిఎంసి నాయకులను సిబిఐ అరెస్టు చేసింది. ఈ సందర్భంగా తమ విధులను అడ్డుకోవడానికి టిఎంసి నాయకులు ప్రయత్నించారని సిబిఐ ఫిర్యాదు చేసింది. కాగా, ఇందులో తనతోపాటు న్యాయమంత్రి ఘటక్ పాత్రలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయడానికి కోల్‌కతా హైకోర్టు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకటి, మమత, ఘటక్ తరఫున రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

SC Judge recuses from hearing mamata’s petition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News