Friday, May 3, 2024

రేప్ కేసుల్లో మహిళ పేర్ల ప్రస్తావన వద్దు

- Advertisement -
- Advertisement -

SC takes exception to verdict by Chhattisgarh court

న్యూఢిల్లీ: ట్రయల్ కోర్టు తీర్పులో అత్యాచార బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఇటువంటి తప్పిదాలు ఇక ముందు ఏ దిగువ స్థాయి న్యాయస్థానం చేయరాదని, జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. మహిళ లైంగిక అత్యాచారానికి గురైనప్పుడు తీర్పు క్రమంలో కానీ విచారణల దశలో కానీ బాధితురాలి పేరును ఎక్కడా వెలుగులోకి తీసుకురాకూడదు. ఇది న్యాయపరమైన సాంప్రదాయం. నిర్థిష్ట పద్థతి, అయితే ఛత్తీస్‌గఢ్ సెషన్స్ కోర్టు ఇందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. బాధితురాలి పేర్లు వెల్లడించకూడదనే అంశం నిర్థిష్టంగా ఉన్నప్పుడు ఈ విధమైన తీర్పు వెలువడటం సరికాదని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, వినీత్ శరణ్, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తెలిపింది.

SC takes exception to verdict by Chhattisgarh court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News