Wednesday, May 15, 2024

గుట్కా విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
four arrested for selling gutka in hyderabad

 

రూ.5.25లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

హైదరాబాద్: నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 25 రకాల గుట్కా, పొగాకు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని బంజారాహిల్స్, నూర్‌నగర్‌కు చెందిన షేక్ రిజ్వాన్ క్లాసిక్ పాన్ షాపు నిర్వహిస్తున్నాడు, యూసుఫ్‌గూడకు చెందిన తేజారామ్‌కుమావత్ అలియాస్ బుధరాం గుట్కా, సేల్స్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు, రమేష్‌కుమావత్, శ్రీకృష్ణనగర్‌కు చెందిన కాలురాం కుమావత్ గుట్కా, పొగాకు సప్లయ్ చేస్తున్నాడు. రామ్ కుమావత్, కలురామ్ కుమావత్ గుట్కా, పొగాకు వస్తువులను సప్లయ్ చేస్తున్నారు. వీరికి షేక్ రిజ్వాన్ తదితరులు వీటిని అందజేస్తున్నారు. కర్నాటకలోని బీదర్‌కు చెందిన దినేష్ కుమార్ వీరికి గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాజేష్, ఎస్సై రంజిత్‌కుమార్, మల్లికార్జున్, షేక్ కవిఉద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News