బాలికల విద్య కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తోన్న స్కాలర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి విద్యార్థినులు, తల్లిదండ్రులకు సూచించారు. తెలంగాణలో 15 వేల మంది విద్యార్థినులకు ఏడాదికి రూ.30 వేల స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు అని పేర్కొన్నారు. 2 నుంచి 5 సంవత్సరాల వ్యవధి గల రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థినులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్‌తో కలిసి మంగళవారం చైర్మన్ బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన 15 వేల మంది బాలికలకు వారి కోర్సు
పూర్తయ్యేంత వరకు ఏడాదికి రూ.30 వేలు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలో 18 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమ ఫౌండేషన్ బాలికల విద్య కోసం స్కాలర్‌షిప్‌లు అందిస్తుందని తెలిపారు. బాలికలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కోసం రెండు విడతల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో అర్హులైన బాలికలు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండో విడతలో జనవరి 10 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదని తెలిపారు. అర్హులైన విద్యార్థినులు ఆన్‌లైన్‌లో https://azimpremjifoundation.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు కేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థినులకు రెండు విడతల్లో ఏడాదికి రూ.30 వేల స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు https://azimpremjifoundation.org వెబ్‌సైట్ లేదా 9849398942 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.