Tuesday, April 30, 2024

గిరిజన బాలికలపై లైంగిక వేధింపులు: డిప్యుటీ కలెక్టర్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలో ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌లో మైనర్ గిరిజన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్(ఎస్‌డిఎం)పై సస్పెన్షన్ వేటు పడినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. గిరిజన బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసేందుకు ఆదివారం ఎస్‌డిఎం సునీల్ కుమార్ ఝా హాస్టల్‌ను సందర్శించిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ఆయనపై నమోదైన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనిఖీల సందర్భంగా మైనర్ బాలికల పట్ల ఎస్‌డిఎం అశ్లీల చర్యలకు పాల్పడినట్లు హాస్టల్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారని జిల్లా ఎస్‌పి అగమ్ జైన్ మంగళవారం తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ఎస్డిఎం సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. హాస్టల్‌లోని 11 నుంచి 13 ఏళ్ల వయసున్న మైనర్ బాలికలను నిందితుడు అసభ్యంగా ముట్టుకోవడమేగాక వారిని ముద్దు పెట్టుకున్నారని, వారి నెలసరి గురించి కూడా ప్రశ్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. జబువా జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా డిప్యుటీ కలెక్టర్ ర్యాంకు అధికారి అయిన సునీల్ కుమార్ ఝాను ఇండోర్ డివిజనల్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News