Thursday, May 2, 2024

ఎన్నికల గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థ: సోము వీర్రాజు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటైందని బిజెపి నేత సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమైందని, ఎన్నికల గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థ పని చేస్తుందని దుయ్యబట్టారు. వాలంటీర్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ఏడాదికి వెయ్యి కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ముందే మండలిలో చర్చించామన్నారు. మహిళల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సోమీ వీర్రాజు స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల అంశం కేంద్ర నిఘా సంస్థలు చూసుకుంటాయన్నారు.

Also Read: రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News