Saturday, November 2, 2024

జడ్చర్ల ఎక్సైజ్ శాఖలో రహస్య డైరీ

- Advertisement -
- Advertisement -

నెల మామూళ్లు రాసుకుంటున్న అధికారి
అబ్కారీ శాఖలో ఆయనదే కీ రోల్
పై అధికారులకు తప్పుడు సమాచారాలు
అంతా ఒక్కడే వసూళ్లు
ఊరూరా బెల్టుషాపులకు ప్రోత్సాహం

మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో/ జడ్చర్ల : జడ్చర్ల అబ్కారి శాఖలో ఆయనో కింగ్ మేకర్.పై స్థాయి అధికారులు ఉన్నా ఈయన ఏమి చెబితే అది వినాల్సిందే. ఈయన చెప్పిందే వేదం. ఏ శాఖలో లేని ప్రత్యేక పాలసీని ఇక్కడి అబ్కారి శాఖలో అమలు చేస్తున్నారు. అదే రహస్య డైరి. ఇంతకు ఈ రహస్య డైరీలో ఏముంటాయనుకుంటున్నారా.. అదే నెల వారి మామూళ్లు వివరాలు.. జడ్చర్లతో పాటు ఏడు మండలాలకు ఆయనే ఇంచార్జీ.అయన ఏమి చెబితే వారు వినాల్సిందే. వినక పోతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో దాడులు చేయించి కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. దీంతో చేసేది లేక ఆయన డైరీలో తమ మామూళ్లు రాపించుకుంటున్నారు.

జడ్చర్లతో పాటు ఏడు మండలాల్లో పలు వైన్‌షాపులు, బెల్టుషాపులు, కల్లు దుకాణాలు ఉన్నాయి. పల్లెల్లో బెల్టుదుకాణాలు ఉంటే బెల్టు తీయాలని అబ్కారి శాఖ అధికారులకు ప్రజాప్రతినిధులు సైతం ఎప్పుడో ఆదేశాలిచ్చారు. అయితే ఇక్కడ ఈ అధికారికి బెల్టుషాపులే మామూళ్లకు కేంద్రబిందువుగా మారాయి .దీంతో ఆయనకు కానుకల వర్షం కురిపిస్తున్నాయి. జడ్చర్లతో పాటు మిడ్జిల్, నవాబుపేట, రాజాపూర్, బాలానగర్, భూత్పూర్ తదితర మండలాల్లో ఉన్న వైన్‌షాపుల్లో ఒకటి రిటైల్ హోల్ సేల్ షాపు కాగా, మరొక జనరల్ షాపు గా మార్చి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. బెల్టుషాపులకు ఒక్కో క్వార్టర్లకు అదనంగా రూ. 10 చొప్పున విక్రయించగా, బెల్టుషాపుల నిర్వాహకులు మందు బాబులకు రూ. 20 అదనంగా వసూళ్లు చేసుకుంటున్నారు. దీంతో మద్యం షాపుల నుంచి అబ్కారి శాఖ అధికారులకు నెల మా మూళ్లు సమర్పించుకుంటున్నారు.

ఈ దందాలో అందరి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ తరహా వసూళ్లలో జడ్చర్ల అబ్కారి శాఖలో వసూల్ రాజాదే కీలక పాత్రగా ఉన్నట్లు సమాచారం. ఆయనే ఈ లెక్క జమను డైరిలో రాసుకుంటున్నట్లు సమాచారం. ఏ షాపు నుంచి ఎంత వచ్చింది, ఏ బెల్టుషాపు నుంచి ఎంత వచ్చింది వంటి పూర్తి వివరాలతో డైరీని మెయింటెన్ చేస్తుండడంతో అన్ని వివరాలు పక్కాగా రాసుకొని నెల వారి అబ్కారికి వచ్చే అక్రమ ఆదాయాన్ని లెక్కపెట్టుకుంటున్నట్లు సమాచారం. ఈ శాఖలో ఉన్న ఈ అధికారి కేవలం విధుల కంటే మూమూళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. పై అధికారులకు తప్పుడు సమాచారం కూడా ఇస్తూ ఇష్యూను పక్కదారి పట్టించడంలో మహా సిద్దహస్తుడనే పేరుంది. ఒక వైపు జడ్చర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అవినీతి, అక్రమాలు లేని పాలనను అందించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుండగా అబ్కారి శాఖలో అవినీతి జలగలపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు.

జడ్చర్ల అబ్కారీ శాఖ ఎప్పుడూ వివాదాలే

జడ్చర్ల అబ్కారి శాఖ ఎప్పుడూ వివాదాలతోనే ఉంటుందని చెబతున్నారు. గతంలో ఒక అధికారి కల్లు దుకాణాల లైసన్స్ మంజూరు విషయంలో మూమూళ్ల వ్యవహారం బయటికి పొక్కడంతో ఆయన్ను సస్సెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన హాయంలో వైనషాసుల దగ్గర నుంచి కల్లు దుకాణాల వరకు మామూళ్ల వ్యవహారం బట్ట బయలు కావడంతో పై అధికారులు ఆయన్ను సస్సెండ్ చేశారు. ఇక్కడ కృత్రిమ కల్లు నడుస్తున్నా, వైన్‌షాపులు ఇష్టారాజ్యంగా నడుస్తున్నా, బెల్టుషాసులు దర్జాగా చేసుకోవాలన్నా అబ్కారి శాఖ అధికారుల రహస్య డైరీలో పేజి రాసుకుంటే చాలు అన్న పరిస్థితితులు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఏడు మండలాల కింగ్ మేకర్ కూడా వసూల్ రాజాగా మారి దందాలు చేస్తుంటే పై అధికారుల్లో చలనం లేక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజాలు నిర్భయంగా రాసే విలేకర్లపై కూడా ఆయన మందు అడిగారని ( అడగకున్నా ) తప్పుడు మాటలు పై అధికారులకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈయన గారు రాసుకున్న డైరీని ఎసిబి అధికారులు స్వాదీనం చేసుకుంటే అసలు విషయాలు బయటికి వస్తాయని పలువురు చెబుతున్నారు. ఫోన్‌పే,గుగుల్ పే వివరాలు కూడా సేకరిస్తే తెలిసిపోతుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News