Monday, May 6, 2024

స్టాక్ మార్కెట్లో జోష్ !

- Advertisement -
- Advertisement -

Stock Market
హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం ప్రకటనతో దూకుడు

న్యూఢిల్లీ: షేర్ మార్కెట్ సూచీలు అయిన సెన్సెక్స్ 1335.05 పాయింట్లు(2.25 శాతం) ఎగబాకి 60611.74 వద్ద ముగియగా, నిఫ్టీ 382.95 పాయింట్లు ర్యాలీ చేసి 18053.40 వద్ద ముగిసింది. సోమవారం షేర్ మార్కెట్ దూకుడికి హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ల విలీనం ప్రకటన కొంత వరకు కారణమైంది. మార్కెట్‌లు నిన్నటి కన్నా 1 శాతం పెరుగుదలతోనే ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత 2.5శాతం వరకు ఇంట్రాడేలో పెరిగాయి. సెన్సెక్స్ 60845.10 అత్యధిక మార్క్‌ను టచ్ చేయగా, నిఫ్టీ 18114.65 మార్క్‌ను టచ్ చేసింది. కొటక్ మహీంద్ర బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, లార్సెన్ అండ్ టూబ్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభపడగా, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీలు నష్టపోయాయి. ఈ వారంలో ఆర్‌బిఐ సమావేశం, ఎర్నింగ్ రిపోర్ట్‌పైన ఫోకస్ చేయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News