Friday, May 3, 2024

6.6లక్షల మందికి వచ్చి.. పోయింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మురుగునీటిలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదు
80% మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నుంచి పరిశీలన, 2 లక్షల మంది విసర్జితాల్లో వెలుగుచూసిన కొవిడ్
సిసిఎంబి, ఐఐసిటి సంయుక్త పరిశీలనల్లో సంచలన అంశాలు

Cabinet to set up NRA Conduct tests for Govt Jobs

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా వైరస్ వచ్చి వెళ్లినట్లు సిసిఎంబి(సెంటర్‌ఫర్ సె ల్యూలర్ అండ్ మాలిక్యూలర్) నివ్వెరపోయే అంశాన్ని వెల్లడించింది. అయితే తాము చేసిన పరిశోధన సర్వే ప్రకారం 80 శాతం మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల కేంద్రాల్లో 2.6 లక్షల మంది విసర్జీతాల నుంచి వైరస్ వెలువడిందని, దీన్ని పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో సగటు న 6.6 లక్షల మందికి వైరస్ సోకినట్లు అంచనా వేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే వీరంతా 35 రోజుల్లో వైరస్ బారిన పడటమో లేదా, కోలుకోవడమో జరిగిందని సిసిఎంబి శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు ఇటీవల సిసిఎంబి, ఐఐసిటీ సంయుక్తంగా మురుగునీటిలోని విసర్జీతాలపై పరిశోధనలు చేసింది. ఈ రీసెర్చ్ ద్వారా మల, మూత్ర విసర్జితాల నుంచి కూడా వైరస్ బహిర్గతం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, వీటి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని సిసిఎంబి పేర్కొంది. అయితే ఇప్పటి వరకు కరోనా బాధితుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాధి వ్యాపిస్తుందని నిపుణులు వెల్లడించారు. కానీ తాజాగా సిసిఎంబి చేసిన ప్రకటనతో అందరిలో ఆందోళన నెలకొంది.
80 శాతం కేంద్రాల్లో పరిశోధన…
హైదరాబాద్ సిటీలో మురికినీళ్లను శుద్ధి చేసే 80 శాతం ఎస్టిపీ కేంద్రాల్లో సిసిఎంబి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ప్రస్తుతం నగరంలో 1800 మిలియన్ల నీటిలో కేవలం 40 శాతం మురికి నీరు మాత్రమే కలుస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే సిసిఎంబి పరిశోధన చేసిన మురికి నీటిలో దాదాపు 2 .6లక్షల మంది విసర్జీతాల నుంచి కోవిడ్ వైరస్ అవశేషాలు కలిసినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇవి కోవిడ్ పేషెంట్ మల, మూత్రాల ద్వారా మాత్రమే బహిర్గతమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ పరిశోధన ఎందుకు చేయాల్సి వచ్చింది..?
ఇప్పటి వరకు కోవిడ్ వైరస్ తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా చెబుతుంది. అయితే గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కొందరు సైంటిస్టులు చెప్పినప్పటికీ డబ్లూహెచ్‌ఓ దాన్ని సమర్ధించలేదు. ఈక్రమంలో మల,మూత్రాల నుంచి వైరస్ బహిర్గతమవుతుందా? ఒకవేళ ఉంటే అయితే వ్యాప్తి చెందే అవకాశం ఉందా? అనే అంశాలను సిసిఎంబి, ఐఐసిటి సంయుక్తంగా సుదీర్ఘ పరిశోధనలు చేశారు. అయితే మల, మూత్రల ద్వారా వైరస్ వ్యాప్తి చెందడం లేదనేది సిసిఎంబి అధ్యాయనంలో వెల్లడైంది. అంతేగాక మురికినీటిలో మల,మూత్రాల ద్వారా కలసిన వైరస్ ప్లాంట్‌లలో శుధ్ది తర్వాత కనిపించడం లేదనే ఆసక్తికర విషయాన్ని కూడా సిసిఎంబి అధికారికంగా ప్రకటించింది. అంతేగాక ఈ పరిశోధన ద్వారా ఏ ప్రాంతాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు రీసెర్చ్ చేయాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా నివారణ చర్యలు వేగంగా చేయొచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే వైరస్ తాము గుర్తించిన ఆనవాళ్లల్లో ఎక్కువ శాతం సింప్టమ్స్ లేని వాళ్లేనని కూడా సిసిఎంబి చెప్పుకొచ్చింది.
ఆరోగ్యవ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి..సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా…
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలోనూ హైదరాబాద్ ప్రజల ఆరోగ్యవ్యవస్థ అద్బుతంగా పనిచేస్తుందని సిసిఎంబి డైరెక్టర్ డా రాకేష్ మిశ్రా తెలిపారు. ఇక్కడ జీవనశైలి, ఆహారపు అలవాట్లు వలన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా పనిచేస్తుందన్నారు. అయితే కార్యాలయాల్లో, ఇతర ప్రదేశాల్లో కామన్ బాత్రుంలు వాడాల్సి వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఆయన తెలిపారు. ఈ పరిశోధనలో ఐఐసిటి, సిసిఎంబి శాస్త్రవేత్తలు మనుపాటి హేమలత, హరీష్‌శంకర్, వెంకటమోహన్, ఉదయ్‌కిరణ్, కుంచా సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News