Thursday, May 2, 2024

కెటిఆర్ ట్వీట్ కు స్పందించిన షాదాన్ కాలేజీ వైద్యుడు

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలను ఆదుకోవాలని షాదాన్ కాలేజీ యజమాన్యానికి మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. షాదాన్ కాలేజీ వైద్యుడు ఆసిఫ్ బేక్ కెటిఆర్ ట్వీట్‌కు స్పందించారు. బంజారాహిల్స్ సయ్యద్‌నగర్‌లో 30 మంది వలస కూలీలకు నివసిస్తుండడంలో నెలకు సరిపడా నిత్సవసర సరుకులను వాళ్లకు షాదాన్ డాక్టర్ ఆసిఫ్ బేక్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో నగరంలోని 1500 మంది కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని డాక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు భారత్ దేశంలో కరోనా వైరస్ 19,357 మందికి సోకగా 560 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 858కి చేరుకోగా 21 మంది చనిపోయారు. ఎపిలో కరోనా బాధితుల సంఖ్య 647కి చేరుకోగా 17 ప్రాణాలు విడిచారు. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా రోగులు సంఖ్య 4200కు చేరుకోగా 223 మంది మరణించారు.

Shadan college doctor respond on ktr tweet due help
shadan-college-doctor-help-labout-due-ktr-tweet
shadan-college-doctor-help-labout-due-ktr-tweet
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News