Sunday, April 28, 2024

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్ష

- Advertisement -
- Advertisement -

She strike against lover house in AP

అమరావతి: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు చివర క్షణంలో మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా బాపట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాపట్లలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన నాగార్జున అనే యువకుడు ప్రేమ పేరుతో నాగజ్యోతి వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని పలుమార్లు ఆమెతో నమ్మపలికాడు. దీంతో నాగజ్యోతి, నాగార్జున కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యలో మరో యువతితో నాగార్జున పెళ్లి నిశ్చయం కావడంతో నాగజ్యోతి షాక్ కు గురైంది. దీంతో అతడికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో అతడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగింది. తనని వివాహం చేసుకునే వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News