Sunday, April 28, 2024

బిజెపి ఎంపి అభ్యర్థిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

తమిళనాడు ప్రజలపై బిజెపి నాయకురాలు శోభా కరండ్లజె ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేసింది. బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శోభ కరండ్లజెపై డిఎంకె ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ బుధవారం కర్నాటక ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఓ)ని ఆదేశించిన నేపథ్యంలో శోభపై కేసు నమోదు చేసినట్లు ఎన్నికల మిషన్ అధికారులు గురువారం నాడిక్కడ తెలిపారు. కాటన్‌పేట్ పోలీసు స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో ఒక ర్రాజకీయ ప్రముఖనిపై ఇసి కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి.

ఈ విషయమై చర్యల నివేదికను 48 గంటల్లో అందచేయాలని కూడా ఇసి ఆదేశించింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఐఇడి పేలుడుకు తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కారణమని శోభ ఆరోపించారని, ఆమె వ్యాఖ్యలు తమిళనాడు ప్రజలందరినీ ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నట్లు ఉన్నాయని డిఎంకె తన ఫిర్యాదులో పేర్కొంది. బెంగళూరులో గత మంగళవారం జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ప్రసంగించిన శోభ కర్నాటకలో శాంతి భద్రతలు దిగజారాయని, తమిళనాడు నుంచి వ్యక్తులు బాంబులు పెడతారని, ఢఙల్లీ నుంచి వచ్చిన వారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తరని, కేరళ నుంచి వచ్చిన కొందరు యాసిడ్ దాడులు చేస్తారని ఆరోపించారు.

అనంతరం తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పి వాటిని వెనుకకు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నందుకు మదురై పోలీసులు కూడా శోభపై కేసు నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌తోపాటు ఇతర డిఎంకె నాయకులు తీవ్ర నిరసన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News