- Advertisement -
హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం రోజురోజుకీ ముదిరిపోతుంది. నిర్మాతలు-ఫెడరేషన్ నాయకులు మధ్య చర్చలు సఫలం కావడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (TPCC) కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని యూనియన్లు నిర్వహించే సమ్మె ముగిసేవరకూ ఎలాంటి షూటింగ్‌లు చేయొద్దని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది. అంతేకాకుడా స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్‌లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతులు లేకుండా సేవలు అందించకుడదని పేర్కొంది. నిర్మాతలు, స్టూడియో విభాగ సభ్యులు ఈ ఆదేశాలను అత్యంత తీవ్రంగా పరిగణించి వాటిని పూర్తిగా పాటించాలని ఫిల్మ్ చాంబర్ ఆదేశించింది.
- Advertisement -