Tuesday, May 14, 2024

వాటి నుంచే వినోదాన్ని రప్పించాం

- Advertisement -
- Advertisement -

Siddhu act in DJ Tillu movie

గుంటూర్ టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాథ వినుమా వంటి చిత్రాలతో నటుడిగానే కాదు ప్రతిభ గల రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన కొత్త సినిమా ‘డిజె టిల్లు’. నేహా శెట్టి నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలసి నిర్మించాయి. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. ఈ నెల 12న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ’డిజె టిల్లు’ సినిమా విశేషాలను హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు.

ప్రేమ కథకు క్రైమ్ కోణాన్ని జతచేసి…

నేను, దర్శకుడు విమల్ కృష్ణ కలిసి ఈ సినిమా కథ, మాటలు రాశాం. రచనలో మా ఇద్దరి కృషి ఉంది. – ప్రేమ కథకు చిన్న క్రైమ్ కోణాన్ని జతచేసి రాసిన కథ ఇది. ప్రేమ కథే ఎక్కువగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన మనుషుల్లో ఒక ప్రత్యేకమైన ప్రవర్తన గమనించాను. వాళ్ల క్యారెక్టర్‌లను తెరపై చూపించాలని అనుకొని ఈ సినిమాలో పాత్రలను రూపకల్పన చేశాం.

తెలంగాణ యాసలో…

సినిమాలో -డిజె టిల్లు రాత్రంతా పోగ్రాముల్లో ఉంటాడు. ఉదయం ఆలస్యంగా లేస్తాడు. అతను కొత్త కొత్త ప్యాషన్‌లు ఫాలో అవుతాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, డ్రెస్‌లతో కనిపించే అతను తెలంగాణ యాసలో మాట్లాడుతుంటాడు.

హాయిగా బతికేస్తుంటాడు…
సినిమాలో టిల్లుకు పెద్దగా డీజే చేసే ప్రతిభ ఉండదు. ఏవో రెండు మాస్ పాటలు చేసి వాటితోనే ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఆ రోజుకు వచ్చిన డబ్బులు ఖర్చు చేసేస్తాడు. అతనికి డబ్బులు వెనకేయాలి, ఇంకేదో చేయాలనే ఆలోచనలు ఉండవు. ఉన్నంతలో హాయిగా బతికేస్తుంటాడు. తన చుట్టూ తిరిగేవాళ్లకు ఖర్చు పెడుతుంటాడు.

అది తెరపైనే చూడాలి…

ఇది బుద్ధిగా, ఒక పద్దతితో రాసుకున్న కథ కాదు. క్యారెక్టర్ నుంచి, కథ నుంచి, త్రివిక్రమ్ సూచనల నుంచి పుట్టిన అంశాలన్నీ కలిపి కథగా రాసుకున్నాం. వినోదంతో పాటు ఒక మంచి విషయం ఈ సినిమాలో ఉంటుంది. అది తెరపైనే చూడాలి. అప్పటిదాకా నవ్వించే టిల్లు ఒక మంచి విషయం చెప్పి ముగిస్తాడు. అది సందేశం ఇచ్చినట్లు కూడా అనిపించదు కానీ ప్రేక్షకులకు చేరుతుంది.

వాటి నుంచే వినోదం…

హీరో కోణంలో సాగే కథే ఇది. అయితే నాయికకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. హీరో ప్రేమ బాధితుడు. ఆ బాధ, విసుగు నుంచే వినోదాన్ని రప్పించాం. దర్శకుడు విమల్ నాకు స్నేహితుడు. మా మధ్య సృజనాత్మక విబేధాలు ఎప్పుడూ రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News