Sunday, April 28, 2024

జలమండలి ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీవో నం.60 ప్రకారం వేతనాల చెల్లింపునకు సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : జిహెచ్‌ఎంసి తరహాలో జలమండలిలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంఓఎం కార్మికులకు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీవో 60 ప్రకారం చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదించినట్టు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ఫైనాన్స్ వి భాగం క్లియరెన్స్ ఇవ్వగా, సంబంధిత ఫైలును మంత్రి కేటీఆర్ క్లియర్ చే సేందు అంగీకరించినట్టు తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన వివరాల ను బాగ్‌లింగంపల్లి బిఆర్‌టియూ కార్యాలయంలో కనీస వేతనాల సలహా మం డలి చైర్మన్ పి. నారాయణతో కలిసి రాంబాబు యాదవ్ బుధవారం వెల్లడించారు.

వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కాంట్రా క్ట్, ఔట్ సోర్సింగ్, ఎంఓఎం కార్మికులకు జీవో నంబరు 11, 14 ప్రకారం వేతనాలు చె ల్లించే విధానం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీలో జీవో 14 ప్రకారం, వాటర్ వ ర్క్‌లో జీవో నంబరు 11 ప్రకారం వేతనాలు అందుతున్నట్టు తెలిపారు. వాటర్ వర్క్‌లో పనిచేసే 3991 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సైతం మున్సిపల్ శాఖ చెల్లిస్తున్నట్టుగానే జీవో నంబరు 14 ప్రకారం వేతనాలు చెల్లించాలని జలమండలిలో గుర్తింపు పొందిన హెచ్‌ఎండబ్లూఎస్‌ఎస్‌బి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ విషయాలను చాలా లోతుగా పరిశీలించిన మంత్రి కేటీఆర్ జీవో నంబరు 14ను అప్‌డేట్ చేస్తూ నూతనంగా జీవో నంబరు 60 విడుదల చేసినట్టు వివరించారు.

ఈ మేరకు మున్సిపల్ శాఖలో పనిచేసే వారితో పాటే వాటర్ వర్క్‌లో పనిచేసే కార్మికులకు సైతం జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు అందుతాయని అన్నారు. దీంతో వాటర్ వర్క్‌లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంఓఎం విధానంలో పనిచేసే 3991 కార్మికులకు వేతనాలు పెరగనున్నట్టు చెప్పారు. జలమండలి కార్మికులపై ప్రత్యేక శ్రద్ద వ హించి సమస్యను పరిష్కరించి మేలు జరిగేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి, మంత్రి కెటిఆర్‌కు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌కు రాంబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో యూనియన్ ్ర పధాన కార్యదర్శి బి. కిరణ్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కుమార్, ప్రవీణ్, న రేందర్, బాబు, నాగరాజు, హరీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News