Tuesday, March 21, 2023

ఫిబ్రవరి 24న ‘పులి’ గ్రాండ్ రిలీజ్

- Advertisement -

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఈ చిత్రాన్ని ‘పులి’ – The 19th Century అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన తెలుగు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఎస్.కె రామచంద్రనాయక్ సహా నిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అనూప్ మీనన్, పూనమ్ బజ్వా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం సమకూర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా, అజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News