Wednesday, May 8, 2024

సిమ్ కార్డ్స్ స్వైపింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Sajjanar Said Everyone Should Abide by Traffic Rules

హైదరాబాద్: సిమ్ కార్డ్స్ స్వైపింగ్ చేసి ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతు డబ్బులు కాజేస్తున్న గ్యాంగ్ ఆఫ్ మిరా రోడ్ ముఠాను  సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల గ్యాంగ్ ఆఫ్ మిరా రోడ్ లో ఐదుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు.  నైజీరియా కు చెందిన ప్రధాన నిందితుడు జేమ్స్ పరారీలో ఉన్నాడని,  నిందితుల నుండి నకిలీ ఆధార్ కార్డ్స్, సిమ్ కార్డ్స్, రబ్బరు స్టాంపులు, 15 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..

పలు కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల కు ఐటీ రిటర్న్ పేరుతో పిషింగ్ మెయిల్స్ పంపి రిజిస్టర్ మొబైల్ నెంబర్ తెలుసుకుంటారని తెలియజేశారు. బ్యాంకు ఎకౌంటు కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ తెలుసుకున్న తర్వాత ఆ సిమ్ ను బ్లాక్ చేసి మరో సిమ్ ను తీసుకుని వెంటనే బ్యాంకు లో ఉన్న డబ్బులు కాజేస్తారన్నారు. శనివారం ఉదయం సిమ్ బ్లాక్ చేసి సాయంత్రానికి మరో సిమ్ తీసుకుని డబ్బులు కాజేయడం ఈ ముఠా ప్రత్యేకత వివరించారు.  ఈ విధంగా నగరానికి చెందిన ఇద్దరినీ మోసం చేసి 11 లక్షలు కాజేశారన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ముఠాకు చాలా ఎకౌంటు లు ఉన్నయని, కాజేసిన డబ్బులను బిట్ కాయిన్, హవాలా ద్వారా నైజీరియా కు పంపిస్తారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News