Sunday, April 28, 2024

మన దేశంలో కూడా హైస్పీడ్ కనెక్టివిటి తీసుకరావాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

High speed connectivity need in India

హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. రైల్వే కార్మికులతో ఎప్పుడూ కలిసే ఉన్నామని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. రైల్వే కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. హైస్పీడ్ రైళ్లతో అభివృద్ధి వేగవంతమవుతోందన్నారు. హైస్పీడ్ కనెక్టివిటీ వల్లే అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, మనదేశంలో కూడా హైస్పీడ్ కనెక్టివిటి తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News