Tuesday, October 15, 2024

నటుడు శింబు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడా?!

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీస్ లో ప్రముఖ నటుడు శింబు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్త వినిపిస్తోంది. శింబు పూర్తిపేరు సిలంబరసన్. అంతా శింబు అనే పిలుస్తుంటారు. అయితే అతడి పెళ్లి విషయంలో ఇంకా అధికారికంగా ఏ సమాచారం వెలువడలేదు. కానీ టాక్ వినిపిస్తోందంతే. బహుశా త్వరలో అతడికి పెళ్లి కావొచ్చునేమో.

శింబు బాల నటుడిగా తమిళ సినీరంగంలోకి ప్రవేశించి, 2002 లో ‘కాదల్ అళివతిల్లై’ సినిమాలో లీడింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కాలక్రమేణ అతడు అనేక హిట్ సినిమాలు చేశాడు. సినీ రంగంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ తట్టుకుని తనకంటూ ఓ స్థాయిని సంపాదించుకున్నాడు. అతడి అనేక సినిమాల సమీక్షలు విమర్శలు, మిక్స్ డ్ టాక్ కు గురయ్యాయి.

శింబు ఇటీవలి సినిమాలైన ‘మానాడు’, వెందు తనిందతు కాడు’, ‘పాతు తలా’ మంచి ఆదరణనే పొందాయి. ప్రస్తుతం శింబు దర్శకుడు దేసింగ్ పెరియసామి ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఆ సినిమాను కమల్ హాసన్ కు చెందిన ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ రూపొందిస్తోంది. ఈ సినిమా నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.

శింబుకు ఇప్పుడు 41 ఏళ్లు. ముదురు ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అతడి గురించి చెప్పుకుంటున్నారు. కానీ అతడు ఇదివరలో నటీమణులు నయనతార, హన్సిక మోత్వానీలతో బాగా తిరిగాడనే చెప్పుకుంటున్నారు సినీ పరిశ్రమ వర్గం వారు. అయితే ఇటీవల కాలంలో కూడా నిధి అగర్వాల్, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో కూడా అతడికి ఎపైర్ నడుస్తున్నట్లు వినికిడి వచ్చింది.

ఇదిలావుంటే శింబు తల్లిదండ్రులు తమ కొడుకు త్వరగా సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. తెలుగు నటితో కుదురుకుంటాడని తాజా టాక్. కానీ ఇప్పటికి శింబు పెళ్లి విషయంలో స్పష్టత రావడం లేదు. కానీ అతడి పెళ్లి విషయంలో ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. కానీ శింబు తండ్రి టి.రాజేందర్ మాత్రం ఆయన పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. ఇంతకీ ఈ ముదురు నటుడికి పెళ్లవుతుందో కాదో…

Shimbu2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News