Thursday, April 25, 2024

సింహ రాశి వారు తొందరపాటు వీడడం మంచిది.. లేదంటే..

- Advertisement -
- Advertisement -

సింహం…
–వీరికి ఆదాయం –14, వ్యయం–2, రాజపూజ్యం–1 , అవమానం–7.

వీరు గురుబలం కలిగి ఉంటారు. ఇక శని, అక్టోబర్నుండి రాహు, కేతువులు అనుకూలించరు.ఆర్థికంగా ఉన్నతస్థితి పొందినా ఏదో ఖర్చు ఎదురవుతూనే ఉంటుంది. పోటీపరీక్షలలో అవలీలగా విజయం సాధిస్తారు.ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయికి చేరుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహణపై సంబంధిత వ్యక్తులతో చర్చలు సాగిస్తారు. మీ శుభసంకల్పాలు నెరవేరే సమయం. అయితే కొంత శ్రమ తప్పకపోవచ్చు. ఇంటి నిర్మాణాలు ద్వితీయార్ధంలో కలసివస్తాయి.
అయితే శని ప్రభావం, అక్టోబర్నుండి రాహు, కేతువుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరింత అప్రమత్తంగా మెలగాలి. భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రంగా మారి కొంత ఎడబాటు తప్పకపోవచ్చు.

మీతో సన్నిహితంగా మెలిగిన వారే ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తారు. వ్యాపారులు ఎంత కష్టపడినా మీ అంచనాలకు తగినంత లాభాలు అందుకోలేరు. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, కర్తవ్యాలు నెరవేరుస్తూ ముందుకు సాగాలి. రాజకీయవేత్తలు, పారిశ్రామికవర్గాల వారు తమకు తామే సమస్యలు సృష్టించేకునే వీలుంది. తొందరపాటు వీడడం మంచిది. వైద్యులు, శాస్త్రవేత్తలు గుర్తింపు పొందినా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటారు. కళాకారులకు పరీక్షాసమయం. వీరు తీసుకునే నిర్ణయాలపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కలసివస్తుంది. చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు సానుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి. వీరు శనీశ్వరునికి పరిహారాలు. రాహుకేతువులకు అక్టోబర్31 నుండి పరిహారాలు చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News