Thursday, May 2, 2024

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో సింగపూర్ మహిళకు ఉరి

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ొక మహిళకు సింగపూర్ ఉరిశిక్షను శుక్రవారం అమలు చేసింది. గత 19 ఏళ్లలో ఒక మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఈ వారంలోనే ఇది రెండవ ఉరివశిక్ష. డ్రగ్స్ కు సంబంధించిన కేసులలో ఉరిశిక్షను రద్దు చేయాలని పలువురు కోరుతున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఉరిశిక్షను కొనసాగిస్తోంది. వచ్చే వారం మరో ఉరిశిక్ష అమలు జరుగనున్నట్లు హక్కుల కార్యకర్తలు తెలిపారు.

31 గ్రాముల(109 ఔన్సులు) డయామోర్ఫిన్(స్వచ్ఛమైన హెరాయిన్)ను అక్రమ రవాణా చేసినందుకు 45 ఏళ్ల సరిదేవి జమాని అనే మహిళకు 2018లో ఉరిశిక్ష విధించినట్లు సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో తెలిపింది. 370 మంది డగ్స్ బానిసలకు వారం రోజుల పాటు ఆమె వద్ద లభించిన డ్రగ్స్ సరిపోతాయని బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది.

సింగపూర్ చట్టాల ప్రకారం ఎవరైనా 500 గ్రాముల(17.64 ఔన్సులు) గంజాయి, 15 గ్రాముల(0.53 ఔన్సులు)హెరాయిన్ తో పట్టుబడితే వారికి మరణశిక్ష పడుతుంది. సింగపూర్ కు చెందిన మొహమ్మద్ అజీజ్ హుస్సేన్ అనే 56 ఏళ్ల వ్యక్తి 50 గ్రాముల హెరాయిన్ తో పట్టుపడినందుకు ఉరిశిక్ష పొందిన రెండు రోజులకే జమానికి ఉరిశిక్ష అమలు జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News