Sunday, April 28, 2024

అసెంబ్లీ తర్వాతే సింగరేణి ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

12 కార్మిక సంఘాల డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : కుట్రపూరితంగానే ఏకపక్షంగా సింగరేణి గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని సింగరేణి 12 కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఓటర్ల జాబితా అందించకుండా నామినేషన్ల తేదీలు ప్రకటించడం ముమ్మాటికీ దుర్మార్గం అని మండిపడ్డారు. అయితే నామినేషన్లు వేయకపోతే తమపై అనర్హత వేటు పడుతుందని.. అప్పుడు కొందరి కుట్ర ఫలిస్తుందని పేర్కొంటూ..అందుకే నామినేషన్లు బరాబర్ వేస్తామని వారు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే ఎన్నికల షెడ్యూలు వాయిదాకూ పట్టుబడతామని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికల షెడ్యూల్ మార్చాల్సిందేనని, ఇందుకోసం ఎంతకైనా పోరాటం చేస్తామని సింగరేణి 12 కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కొందరి కనుసన్నల్లో కార్మిక శాఖ అధికారుల చర్యలు ఉన్నాయని దీనిని ఐక్యంగా తిప్పికొట్టి విజయం సాధిస్తామని పేర్కొన్నాయి. ఇందుకు సింగరేణి 12 కార్మిక సంఘాలు మూకుమ్మడిగా తీర్మానం చేసుకున్నట్లు వారు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News