Sunday, April 28, 2024

ఉద్యమంలో పుట్టిన సంఘం… ఎన్నికల్లో పోటీ చేయొద్దనడం బాగోలేదు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సింగరేణి కార్మికుల ఎన్నికల వేళ బిఆర్‌ఎస్ అనుబంధ యూనియన్ టిబిజికెఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. శాసన సభ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌లో ఫలితాల నేపథ్యంలో సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయొద్దని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా కార్మికులకు ఎలా న్యాయం చేస్తామని టిబిజికెఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ అనుబంధ యూనియన్ టిబిజికెఎస్ కార్మిక సంఘానికి అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాని కార్యదర్శ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. సదరు నేతల తమ రాజీనామాను టిబిజికెఎస్ అధ్యక్షురాలు కవితకు పంపారు.

అనేక కష్టాలకు ఓర్చి సంఘాన్ని నెలబెట్టామని నేతలు గుర్తు చేశారు. వెంకట్రావుకు ఉన్న పాత పరిచయాలతో కాంగ్రెస్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబుతోనూ ఎఎన్‌టియూసి నేత జనక్ ప్రసాద్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి రాజీనామాలకు కారణాలను నేతలు వివరించనున్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డా ఏనాడూ బయటపడలేదన్నారు. బాధగానే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వివరణ ఇచ్చారు. ఉద్యమంలో పుట్టిన సంఘాన్ని ఎన్నికల్లో పోటీ చేయొద్దనడం విడ్డూరంగా ఉందని టిబిజికెఎస్ ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News