Tuesday, May 7, 2024

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మొదటి నుండి నెంబర్ వన్ స్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రమే నిలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఈ జనవరి వరకు 91.5 పిఎల్‌ఎఫ్‌తో జాతీయ స్థాయిలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నెంబర్‌వన్ స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ తన వ్యాపార చర్యల్లో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యద్భుతమైన పనితీరుతో అత్యుత్తమ సిఎల్‌ఎఫ్ తో దేశంలోని దా దాపు 250 థర్మల్ విద్యుత్ కేంద్రాలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సింగరేణి ప్రతిభను జా తీయ స్థాయిలో చాటుతోంది.

2010వ సంవత్సరంలో ఈ ప్లాంట్ నిర్మాణానికి పునాదులు పడినప్పటికీ నిర్మాణం మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశం మేరకు సంస్థ సిఎండి ఎన్. శ్రీధర్ దీని నిర్మాణాన్ని అడుగడుగునా పర్యవేక్షిస్తూ ప్రతి 15 రోజులకు ఒక సా రి ప్లాంట్‌ను సందర్శిస్తూ పనులు వేగవంతం చే శారు. ఫలితంగా 2016వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో దీనిని ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రతీ ఏడాది సుమారు 500 కోట్ల రూపాయల ఆ దాయాన్ని సింగరేణి సంస్థకు సమకూరుస్తూ వ స్తోంది. ప్లాంట్‌ను పూర్తి పర్యావరణహిత ప్లాంట్ గా రూపుదిద్దడం కోసం ఫ్లూ గ్యాస్ డీజిల్ ప్లూరిజేషన్ (ఎఫ్‌జిడి ) ప్లాంట్ నిర్మాణాన్ని సుమారు 696 కోట్ల రూపాయలతో చేపట్టింది. ఈ నిర్మా ణం కూడా త్వరలో పూర్తయితే పూర్థి స్థాయిలో పర్యావరణహిత థర్మల్ పవర్ ప్లాంట్‌గా రూపుదిద్దుకోనుంది.
మరో 800 మెగా వాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు !
కాగా మరో 800 మెగా వాట్ల సామర్ధం గల సూ పర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సింగరేణి సంస్థ సన్నాహాలు చేస్తోంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యద్బుతమైన రీతిలో పని చేయటమే కాకుండా రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చిడంలో సుమారు 12 శాతం విద్యుత్‌ను సమకూరుస్తున్నందున ప్లాంట్‌ను మరింత విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో ఆయన ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ సిఎండి ఎన్. శ్రీధర్ పనులు వేగవంతం చేశారు. మరీ ముఖ్యంగా అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సిఎండి శ్రీధర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదం లభించగా ప్రస్తుతం టెండర్ ప్రక్రియ తుది దశలో ఉంది. ఇది పూర్వవగానే నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నారు. దీంతో సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ 1,200 నుండి 2000 మెగావాట్లకు చేరుకుంటుంది.
15,250 కారుణ్య ఉద్యోగాలు
సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే ఈ సంస్థ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుందని పలువురు కార్మికులు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా సింగరేణి అగ్రస్థానంలో నిలువడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కాగా ఇప్పటివరకు 19,463 మంది నిరుద్యోగ యువతకు సింగరేణి సంస్థ ఉద్యోగాలు కల్పించింది. వీటిలో సిఎం కెసిఆర్ ప్రకటించిన కారుణ్య ఉద్యో గ నియామక ప్రక్రియ కింద 15,250 మంది వారసులకు ఇటీవలే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ప్రత్యక్ష నియామకం ద్వారానే 4,207 మందికి ఉద్యోగాలు రావడం విశేషం. థర్మల్ విద్యుత్ కేంద్రం పరంగానే కాదు.. తెలంగాణలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్‌లో అత్యద్భుత వృద్ధిని సాధించింది. తె లంగాణ రాక పూర్వం 2013-14లో 504 లక్షల టన్నులు ఉన్న బొగ్గు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2022- -23లో 33 శాతం వృద్ధితో 671 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరింది.

అలాగే తె లంగాణ రాక పూర్వం 2013 – 14లో 479 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసిన కంపెనీ తెలంగా ణ వచ్చిన తర్వాత 2022- – 23లో 39 శాతం వృద్ధి తో 667 లక్షల టన్నుల బొగ్గను రవాణా చేసింది. మొత్తంగా తెలంగాణ రాకపూర్వం సింగరేణి సం స్థ టర్నోవర్ 11,928 కోట్లు ఉండగా గత తొ మ్మిది సంవత్సరాల్లో 176 శాతం వృద్ధితో గత ఏ డాది 32వేల 978 కోట్లకు పెరిగింది. లాభాల పరంగా చూస్తే.. తెలంగాణ రాకపూర్వం 2014 లో 419 కోట్ల రూపాయల లాభాలు గడించిన సింగరేణి గత ఏడాది 421 శాతం వృద్ధితో 2,184 కోట్ల రూపాయల లాభాలను గడిచింది. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, బొగ్గు రవాణాలో 39 శాతం వృద్ధిని సాధించిన సింగరేణి గడచిన తొమ్మిదేళ్లలో 14 కొత్త గనులను ప్రారంభించుకుంది.

కాగా ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కార్మికుల కోసం 2 వేల విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెంలో నిర్మించారు. కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం పది లక్షల గృహ రుణంపై వడ్డీని సింగరేణి సంస్థ చెల్లిస్తోంది. దేశంలో మరే ఇతర బొగ్గు పరిశ్రమలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో 61 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును అమలు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News