Thursday, May 2, 2024

దేశంలో 6వ స్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం

- Advertisement -
- Advertisement -

Singareni Thermal Power Station is ranked 6th in the country

ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో సగటు 92.49 శాతం పి ఎల్ ఎఫ్ తో మరోసారి అత్యుత్తమ స్థానం
సంస్థ ఛైర్మన్ & ఎండీ శ్రీ ఎన్. శ్రీధర్ అభినందనలు

మంచిర్యాల: జిల్లాలోని జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరో సారి జాతీయ స్థాయిలో తన ప్రతిభ చాటుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం లోని మొదటి త్రైమాసికంలో 92.49 సగటు పి ఎల్ ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించి జాతీయస్థాయి లోని 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. గత ఏప్రిల్ నెలలో నెలవారీ పి ఎల్ ఎఫ్ సాధనలో 98.57 శాతం సాధించి జాతీయ స్థాయిలో 7 వ స్థానం లో నిలిచిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం, మొదటి త్రైమాసికంలో మరో మెట్టు ఎదిగి 6 వ స్థానం లో నిలిచింది. ఏప్రిల్ నెలలో 98.57 శాతం పి ఎల్ ఎఫ్ , మే నెలలో 89, జూన్ నెలలో 90 శాతం పి ఎల్ ఎఫ్ లు సాధించి సగటున త్రైమాసికంలో 92.49 పి ఎల్ ఎఫ్ తో దేశం లో 6 వ స్థానం లో నిలిచింది. గత 3 నెలల కాలం లో ఈ ప్లాంట్ 2424 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగా, దీనిలో 2283 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను రాష్ట్ర అవసరాలకు సరఫరా చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 711 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపిన సింగరేణి థర్మల్ కేంద్రం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 32.83 శాతం వృద్ధితో 944 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది.

సంస్థ ఛైర్మన్ & ఎండీ శ్రీ ఎన్. శ్రీధర్ అభినందనలు

ప్లాంట్ ప్రగతి పై సింగరేణి ఛైర్మన్ & ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ సంబంధిత అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు . ఇక ముందు కూడ మంచి పి ఎల్ ఎఫ్ తో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చడం లో తమ వంతు బాధ్యత నిర్వహించాలని కోరారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తాను ప్రారంభమయిన నాటి నుండి చక్కని ప్రతిభ తో పలు మార్లు జాతీయ స్థాయి అత్యుత్తమ 25 ప్లాంటుల జాబితా లో నిలుస్తూ వస్తోంది. విద్యుత్ కేంద్రం ప్రారంభమైన కొద్ది నెలలకే (2017-18) జాతీయస్థాయి జాబితాలో 5వ స్థానంలో నిలిచి తొలి సారిగా తన ప్రతిభను చాటుకుంది . 2019 -20 లో తిరిగి 7స్థానంలో నిలిచింది . 2018-19 లో ఈ స్టేషన్ లో గల 2 యూనిట్లు ఓవర్ హాలింగ్ జరుపుకు న్నప్పటికీ జాతీయస్థాయిలో 16 వ స్థానంలో నిలవడం గమనార్హం. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం మొదలైన విషయాలను సమీక్షించే మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అనే ముంబయి కి చెందిన సంస్థ అత్యుత్తమ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ ప్లాంట్ పెర్ఫార్మర్ అవార్డును ఇటీవలే ప్రదానం చేసింది. ఫ్లై యాష్ ను నూరు శాతం పైగా వినియోగిస్తున్నందుకు జాతీయ స్థాయి అత్యుత్తమ ప్లాంట్ గానూ అవార్డును అందజేసింది.

15 సార్లు 100శాతం పి ఎల్ ఎఫ్ సాధించిన యూనిట్లు

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నూరు శాతం పి ఎల్ ఎఫ్ ను ఇప్పటికి మూడు సార్లు సాధించింది. 2018 లో సెప్టెంబర్ నెలలోనూ, 2019 లో ఫిబ్రవరి నెలలో, అలాగే 2020 సంవత్సరం లో ఫిబ్రవరి నెలలో ఈ కేంద్రం నూరు శాతం పిఎల్ఎఫ్ సాధించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల రెండు యూనిట్లు ఇప్పటికి 15 సార్లు నూరు శాతం పై బడి పి ఎల్ ఎఫ్ సాధించాయి. నెలల వారీగా చూస్తే స్టేషన్ లోని యూనిట్ 2 ఇప్పటికే తొమ్మిది సార్లు నూరు శాతం పి.ఎల్.ఎఫ్. సాధించగా, యూనిట్ 1 ఆరు సార్లు నూరు శాతం పి ఎల్ ఎఫ్ ను సాధించింది. సంస్థ ఛైర్మన్ & ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ప్లాంట్ నిర్వహణ పై చేస్తున్న నెల వారీ సమీక్షలు, సమస్యల తక్షణ పరిష్కారం, సహకారం తోనే తాము బాగా పని చేయ గలుగుతున్నామని, జాతీయ స్థాయిలో నిలుస్తున్నామని నిర్వాహక అధికారులు పేర్కొంటూ చైర్మన్ కు తమ ధన్య వాదాలు తెలుపుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News