Sunday, May 5, 2024

ఏపీలో ఇక స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు

- Advertisement -
- Advertisement -

పేదవాళ్లు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీని మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ప్రారంభించారు. ఈ కార్డులపై లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఫోన్ లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్ లు డౌన్ లోడ్ చేయించాలని, ఈ  పథకం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుందన్నారు. మొత్తం 2513 ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయని చెప్పారు. ఈ పథకం కింద ఏటా 4100 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News