ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సులతో శతకం సాధించింది. దీంతో అత్యంత తక్కువ బంతుల్లోనే శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు సాధించింది. ఓవరాల్ గా రెండో బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టును ధనాధన్ బ్యాటింగ్ తో ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లు విజయం దిశగా తీసుకెళ్తున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వరుస బౌండరీలతో హడలెత్తిస్తున్నారు. ముఖ్యంగా మంధాన భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా మెరుపు అర్థశతకంతో రాణిస్తోంది. దీంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మంధాన(120), కౌర్(52)లు ఉన్నారు.
ఆస్ట్రేలియాపై స్మృతి మంధాన విధ్వంసం.. తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -