Tuesday, May 7, 2024

పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: పోలీస్‌లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ నిఘా వైఫల్యం అక్రమార్కులకు కలిసి వస్తుంది. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు అందిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని తక్కువ ధరకు కొని, అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలించడం ఆందోళన కిలిగించే విషయం, అధికారుల నిఘా వైఫల్యంతోనే అక్రమమార్గాన పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దుండిగల్ ఎస్‌ఐ సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో పోలీస్‌ల బృందం ఈ నెల 13 న దుందిగల్ ఓఆర్‌ఆర్ దగ్గర కాపు కాశారు. పిడిఎస్ బియ్యాన్ని తరలుస్తున్న లారీ బి నంబర్ హెచ్‌ఆర్73ఏ6557ను ఆపి తనిఖీ చేయగా భారీ మొత్తంలో పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి దుందిగల్ పోలీస్‌లు తమదైన రీతిలో విచారణ చేయగా చాదర్‌ఘట్‌కు చెందిన నాయీమ్ ఆధ్వర్యంలో, సూపర్ వైసర్ వశీమ్ ఎల్‌బినగర్ నుంచి జహీరాబాద్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు పరారీలో ఉండగా, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీస్‌లు 40 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని తరలుస్తున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దుందిగల్ సిఐ వై.రామకృష్ణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News