Monday, May 13, 2024

లద్దాఖ్ మృతుల్లో మన వీర జవాన్

- Advertisement -
- Advertisement -

కొందుర్గు: లద్దాఖ్‌లోని బేరి ప్రాంతంలో ఆర్మీ జవాను వాహనం లోయలో పడిపోవటంతో 9 మంది జవాన్లు మృతి చెందారు. మృతుల్లో రంగారెడ్డి జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాను చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని తంగళ్ళపల్లి గ్రామ పంచాయతీలోని తిర్మన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన నీరటి మల్లయ్య శివమ్మ దంపతుల ముగ్గురు సంతానం. అందరిలో చిన్న వాడైన ఆర్మీ జవాన్ నీరటి చంద్రశేఖర్ (30) చిన్ననాటి నుంచే చంద్రశేఖర్ దేశానికి సేవ చేయడం అంటే చాలా మక్కువ. చంద్ర శేఖర్ ముదిరాజ్ తన చదువు ఒకటవ తరగతి నుండి 3 తరగతి వరకు తిర్మాన్ దేవునిపల్లి గ్రామంలో,

4వ తరగతి నుంచి 7 వరకు తంగెళ్లపల్లి గ్రామంలో తర్వాత కొందుర్గ్ బిసి హాస్టల్ లో ఉంటూ 10 వ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి దేశ రక్షణ సేవలో పనిచేయాలని కోరిక ఉన్న శేఖర్ 10వ తరగతి అవ్వగానే దేశ సేవ కోసం ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఆర్మీలో ఉద్యోగం సాధించిన నాటినుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో వీధి వక్రీకరించి శనివారం జవాన్లు కేరే గ్యారిసన్ నుంచి లేహ్ సమీపంలోని క్యారీకి వెళ్తుండగా లద్దాఖ్‌లోని బేరి ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. దీంతో అందులో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందగా నీరటి చంద్రశేఖర్ కూడా వీర మరణం పొందారు. కాగా మృతుడు చంద్రశేఖర్‌కు భార్య లాస్యతో పాటు ఒక కుమారుడు (4), ఒక కూతురు (2) ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News