Tuesday, May 14, 2024

‘రౌడీ బాయ్స్’ గుడ్ బాయ్స్ ఎలా అయ్యారు?

- Advertisement -
- Advertisement -

Song released from Rowdy boys

దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ చిత్రం ద్వారా ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను వైజాగ్‌లోని విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “దర్శకుడు శ్రీహర్ష తన కాలేజీ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా కథ రాసుకొని ఈ సినిమా చేశాడు. యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. రౌడీ బాయ్స్ .. గుడ్ బాయ్స్ ఎలా అయ్యారనేదే ఈ సినిమా కథ”అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీహర్ష మాట్లాడుతూ వైజాగ్‌లో ‘రౌడీబాయ్స్’ ఫస్ట్ సాంగ్ విడుదల కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆశిష్ రెడ్డి మాట్లాడుతూ “మా పాటకు మంచి స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్ చక్కగా నటించింది. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోల్ రైడా, విక్రమ్ , ఆదిత్య నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News