Wednesday, May 8, 2024

రియల్ హీరోకు సెల్యూట్

- Advertisement -
- Advertisement -
Sonu Sood honoured with special aircraft by SpiceJet
సోనూసూద్ స్పైస్‌జెట్ గౌరవం

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది. స్పైస్‌జెట్ విమానం బోయింగ్ 737 పై ఆకర్షణీయ రంగులతో ఆయన బొమ్మను వేశారు. పక్కన ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అని రాసి, ఈ విమానాన్ని ఆయన ఔదార్యతకు, కరోనా దశలో పేదలకు సేవలందించినందుకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. దేశీయ విమానసంస్థ ఈ విధంగా సొంత ఖర్చులతో ఓ వ్యక్తిని గౌరవించడం అరుదైన విషయం.కరోనా ఉధృతి దశలో విదేశాలలో చిక్కుపడ్డ భారతీయులను, దేశంలో వేర్వేరు ప్రాంతాలలో ఉన్న కూలీలను వారి స్వస్థలాలకు పంపించే బాధ్యత తీసుకుని వేలాది మందిని సొంత ఖర్చుతో ఇళ్లకు సోనూసూద్ వారివారి ఇళ్లకు చేర్పించారు. గత ఏడాది కరోనా దశలో స్పైస్‌జెట్ సంస్థ సోనూసూద్‌ల సహకారంతో ఈ మహత్తర కార్యక్రమం సాగింది.

రష్యా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్తాన్, మనీలా, అల్మటీ వంటి పలు దేశాలలో చిక్కుపడ్డ భారతీయులు తిరిగి భారత్‌కు తరలివచ్చేలా చేయడంలో ఈ నటుడు తమ ఔదార్యతను చాటారు.దాదాపు రెండున్నర లక్షల మంది ఈ విధంగా సొంత గూటికి చేరారు. ఈ నటుడితో కలిసి తాము ఈ విధమైన సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా అంతకు మించి గర్వంగా ఉందని విమానయాన సంస్థ ఛైర్మన్, ఎండి అజయ్ సింగ్ తెలిపారు. ఆయన ప్రత్యేక బొమ్మను విమానంపై ముద్రించడం ఆయన నిస్వార్థ సేవకు తాము అందిస్తున్న అపార గౌరవం అని, కష్టకాలంలో ఈ విధంగా ఆదుకోవడంలో ఆయన ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. ఎక్కడెక్కడో చిక్కుపడి తమ వారిని కలుసుకోలేని దశలో తల్లడిల్లిన వారిని ఆదుకున్న వ్యక్తి, బాధలలో ఉన్న వారికి ఆహారం, నిలువనీడ అందించారని సంస్థ ట్వీటు వెలువరించింది. ఆయన పట్ల ఈ విధంగా తమ సంస్థ ఈ చిన్నపాటి కృతజ్ఞతాభావం అని తెలిపారు.తనకు దక్కిన ఈ గౌరవం పట్ల సోనూసూద్ హర్షం వ్యక్తం చేశారు. పది మందికి సాయం తన కనీస కర్తవ్యం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News