Tuesday, August 5, 2025

భారత్ మ్యాచ్ గెలుస్తుందని ముందే తెలిసిపోయింది: గంగూలీ

- Advertisement -
- Advertisement -

భారత్‌-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఇంగ్లండ్ విజయానికి 7 పరుగులు అవసరం ఉన్న తరుణంలో సిరాజ్.. అట్కిన్సన్‌ని ఔట్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ విజయంతో ఐదు టెస్ట్‌ల టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్‌ని భారత్ 2-2 తేడాతో సమం చేసింది. అయితే ఐదో టెస్ట్‌ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతేకాక.. అతన్ని యావత్ దేశమంతా కొనియాడుతుంది. ఈ క్రమంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్ మ్యాచ్ గెలుస్తుందని తనకు ముందే తెలిసిపోయిందని గంగూలీ (Sourav Ganguly) పేర్కొన్నారు. ‘నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత టీం ఇండియా గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగింది. పిచ్ బాగుంది, సిరాజ్, ప్రశిద్ధ్‌లు బౌలింగ్ చేసిన తీరు అద్భుతం’ అని గంగూలీ పేర్కొన్నారు. గంగూలీ అన్నట్టుగానే నాలుగో రోజు వరుస ఓవర్లలో ప్రశిద్ధ్ రెండు వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశాడు. ఇక ఐదో రోజు సిరాజ్ మూడు వికెట్లు, ప్రశిద్ధ్ 1 వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News