Thursday, May 2, 2024

సంగీత ప్రపంచంలోకి ‘ఎస్పీ మ్యూజిక్’

- Advertisement -
- Advertisement -

SP Music enter into songs world

1964లో డా.డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సినిమాల నిర్మాణమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తోంది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ ‘ఎస్పీ మ్యూజిక్’ అనే కొత్త మ్యూజిక్ లేబుల్‌ను ప్రారంభించి సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ “మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాన్ని సొంతగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మేము గుర్తించాము. సురేష్ ప్రొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ‘ఎస్‌పి మ్యూజిక్’ లేబుల్ మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని.. అలాగే సంగీత శక్తి కేంద్రంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News