Tuesday, May 14, 2024

నిర్మాతగా పెద్ద లక్ష్యాలు

- Advertisement -
- Advertisement -

కెరీర్ ప్రారంభంలో తన ‘జీనియస్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ యాక్టర్ హవీష్. అలాగే ‘నువ్విలా’ అనే సినిమాతో కూడా మెప్పించాడు. ఇక ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడి’ సినిమాకు నిర్మాతగా కూడా మరిన్ని చిత్రాలతో బిజీగా ఉన్నాడు. శుక్రవారం హవీష్ తన బర్త్ డే జరుపుకోబోతున్న సందర్భంగా అతను చెప్పిన విశేషాలు…

Havish birth day wishes

మూడు సినిమాలకు ఓకే…
ప్రస్తుతానికి మూడు మంచి సినిమాలు ఓకే చేశాను. వాటిని మా ప్రొడ్యూసర్లే మంచి సమయం చూసి ప్రకటిస్తారు.
డిఫరెంట్ జానర్లు…
నేను ఒప్పుకున్న మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జానర్లు. మొదటిది మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. రెండోది యాక్షన్ డ్రామా.. మూడోది ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఉండే లవ్ స్టోరీ. ఈ మూడు నన్ను కొత్తగా చూపిస్తాయి.
అన్నీ ఒకే ఏడాదిలోనే…
నా కెరీర్ ప్రారంభంలో కేవలం కొన్ని సినిమాలే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒక సమయంలో ఒక్క సినిమానే పూర్తి చేయాలని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈసారి ఒకే ఏడాదిలో నా మూడు సినిమాలు రిలీజ్ చేస్తాను.

నిర్మాతగా పెద్ద లక్షాలు…
ప్రొడక్షన్ అనేది నా కెరీర్‌కు బాగా ఉపయోగపడింది. ఇండస్ట్రీలో మరింత మంది దగ్గరయ్యారు. అలాగే నా యాక్టింగ్‌కి కూడా ప్రొడక్షన్ చాలా పనికొచ్చింది. ఇక నిర్మాతగా రాబోయే రోజుల్లో పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాను. హిందీలో అక్షయ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాం. రవితేజ తో ‘ఖిలాడి’ మూవీ అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.

సిల్వర్ స్క్రీన్ రిలీజే…
సిల్వర్ స్క్రీన్ అనుభూతిని ఓటిటి ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. మళ్లీ ప్రపంచం మాములు స్థితికి వస్తే ఓటిటి డౌన్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం సిల్వర్ స్క్రీన్ రిలీజ్ కోసమే ఎదురు చూస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News