Monday, April 29, 2024

మాది సిని‘మా’ బిడ్డల ప్యానల్

- Advertisement -
- Advertisement -

Actor Prakash Raj

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. సెప్టెంబర్‌లో ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగబోతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించారు. దీంతో ‘మా’ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఖాయమైంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27 మందితో ఈ జాబితాను విడుదల చేశారు. ఈ ప్యానల్‌లో ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవింద రావు, శ్రీధర్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ “మాది సిని‘మా’ బిడ్డల ప్యానల్. ‘మా’ శ్రేయస్సు దృష్టా… నిర్మాణాత్మక ఆలోచలను ఆచరణలో పెట్టే దిశగా… పదవుల కోసం కాకుండా పనులు మాత్రమే చేయడం కోసం ‘మా’ టీంతో రాబోతున్నాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News