Monday, May 6, 2024

వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయించండి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ శ్రేణులకు సోనియా పిలుపు

Vaccination speed up in India

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పార్టీ వివిధ స్థాయిలలో చురుగ్గా పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ సూచించారు. వ్యాక్సిన్లు వేసుకోవడంలో కొందరు తటపటాయిస్తున్నారు. భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇటువంటి వారు తమ దృష్టికి వస్తే పార్టీ కార్యకర్తలు వారికి వ్యాక్సిన్లపై భయాలు పోగొట్టాల్సి ఉందని, ఈ దిశలో పార్టీ వివిధ స్థాయిల నేతలు అన్ని విధాలుగా ముందుకు రావాలని సోనియా కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ ఇన్‌చార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో గురువారం ఏర్పాటు అయిన సమావేశంలో సోనియా మాట్లాడారు. టీకాలు అందరికీ అందేలా చూడాల్సి ఉంది. ఇదే దశలో థర్డ్ వేవ్ పొంచి ఉందనే భయాల నడుమ అంతా సర్వసన్నద్ధంగా ఉండేలా పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రత్యేకించి బాలలు ఈ మూడో ముప్పు బారినపడకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దేశంలో కాంగ్రెస్‌పార్టీ వ్యాక్సినేషన్‌ను కించపరుస్తోందని, లేని పోనిలోపాలను వెతుకుతూ, వ్యాక్సిన్లపై భయాలను కల్పిస్తూ ప్రజలలో టీకాలు తీసుకోవాలా? లేదా అనే మీమాంసను రూపొందించిందని బిజెపి చేస్తున్న విమర్శలపై సోనియా స్పందించారు. రోజువారి వ్యాక్సిన్ల సంఖ్య పెరగాల్సి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ మరింత చురుకైన పాత్ర పోషించాలి, ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో 75 శాతం మందికి టీకాలు అందేలా చేయడం జరిగితే వైరస్ ముప్పు తప్పించుకునేందుకు వీలేర్పడుతుందని సోనియా పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కొవిడ్‌పై ప్రభుత్వం స్పందించిన తీరును తెలిపే కొవిడ్ మేనేజ్‌మెంట్‌పై కాంగ్రెస్ తీసుకువచ్చిన శ్వేతపత్రాన్ని ప్రస్తావిస్తూ , దీనిని అన్ని భాషలలోకి తర్జుమా చేయాల్సి ఉందన్నారు. ప్రాంతీయ స్థాయిలలో విషయం విదితం అయ్యేలా స్థానిక నేతలు దీనిని త్వరగా వెలుగులోకి తేవాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News