Monday, May 13, 2024

భూ కక్ష్యలోకి సామాన్యుల ప్రయాణం

- Advertisement -
- Advertisement -
SpaceX was the first civilian spaceflight
స్పేస్‌ఎక్స్ తొలి పౌర అంతరిక్షయానం

కేప్‌కానావెరల్ (యూఎస్): అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ నలుగురు సామాన్యులతో కూడిన వాహక నౌకను నింగిలోకి పంపింది. వీరు మూడు రోజుల పాటు భూ కక్షలో ప్రయాణిస్తారు. ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా సామాన్య పౌరులతో కూడిన ఓ ప్రైవేట్ వాహకనౌక భూ కక్షలో ప్రయాణించడం ఇదే తొలిసారి. అంతరిక్ష పర్యాటకాన్ని వృద్ధి చేయడమే లక్షంగా తొలిపౌర అంతరిక్షయానాన్ని చేపట్టిన ఘనత స్పేస్‌ఎక్స్‌కు దక్కింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.02 గంటల ప్రాంతంలో ఫ్లోరిడా లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లింది. దాదాపు 12 నిమిషాల తరువాత డ్రాగన్ కాప్సూల్ రాకెట్ నుంచి వేరవడంతో వాహక నౌక భూ కక్షలో చేరింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైందని, నిర్దేశిత మార్గంలో వెళ్లిన రాకెట్ … ప్రయాణికులను భూ కక్ష లోకి తీసుకెళ్లిందని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది.వీరంతా మూడు రోజుల పాటు భూమి చుట్టూ ప్రయాణించి … తిరుగు ప్రయాణమవుతారని తెలిపింది.

ఎవరా నలుగురు ? ఫాల్కన్ 9 రాకెట్‌లో ప్రయాణించిన నలుగురిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు రిచ్ స్పాన్సరర్ అయిన బిలియనీర్ 38 ఏళ్ల జారెద్ ఇజాక్‌మన్. ఈయన ఈ రాకెట్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు 29 ఏళ్ల హేలీ ఆర్సెనాక్. 42 ఏళ్ల క్రిస్ సెంట్రోస్కీ, 51 ఏళ్ల నియాన్ ప్రాక్టర్ ఉన్నారు. అమెరికా లోని లూసియానాకు చెందిన హెలీ… చిన్న వయసు లోనే ఎముక క్యాన్సర్‌ను జయించింది. తనలాంటి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఫిజీషియన్ అసిస్టెంట్ కోర్సును పూర్తి చేసి… ప్రస్తుతం క్యాన్సర్ బాధితులకు సేవలందిస్తోంది. ఇక క్రిస్ …. వాషింగ్టన్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తుండగా సీయాన్ ఫ్రాక్టర్ అరిజోనాలో కమ్యూనిటీ కాలేజీ ఎడ్యుకేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

స్పేస్‌ఎక్స్ అరుదైన రికార్డు

అంతరిక్ష పర్యాటకంలో స్పేస్‌ఎక్స్ తొలిప్రయోగం ఇదే అయినప్పటికీ అరుదైన రికార్డు నెలకొల్పింది. స్పేస్‌ఎక్స్ కంటే ముందు వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆర్జిన్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాయి. బ్లూ ఆరిజన్‌లో ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ కూడా ప్రయాణించారు. అంతకు ముందు వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగించిన వాహక నౌకలో ఆ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్‌సన్‌తో పాటు కంపెనీకి చెందిన మరో ముగ్గురు అధికారులు అంతరిక్షం లోకి వెళ్లారు. అయితే వీరంతా అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ (ఐఎస్‌ఎస్)వరకే వెళ్లారు. కొద్దిసేపు అంతరిక్షంలో గడిపి తిరిగొచ్చారు. కానీ స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ ఐఎస్‌ఎస్‌ను దాటి భూ కక్ష వరకు వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News