Sunday, April 28, 2024

కెరీర్ విజయవంతానికి కాలేజ్ డిగ్రీ తప్పనిసరికాదు: ఆండీ జస్సీ

- Advertisement -
- Advertisement -

college degree not necessary for career success

బెంగళూరు: ఎలాంటి విద్యా నేపథ్యం ఉన్న వారికైనా అమెజాన్‌లో ఉద్యోగాలు ఉన్నాయని ఆ కంపెనీ సిఇఒ ఆండీ జస్సీ గురువారం చెప్పారు. అమెజాన్ కెరీర్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ఫైర్‌సైడ్ ఛాట్‌లో మాట్లాడుతూ “కాలేజ్ డిగ్రీ ఉపయోగపడుతుందా? అంటే అవునంటాను. కెరీర్ విజయవంతం కావడానికి డిగ్రీ ఉపయోగపడుతుందా? అంటే మాత్రం కాదంటాను. మా దగ్గిర(అమెజాన్ కంపెనీలో) ఎలాంటి విద్యా నేపథ్యం ఉన్నవారికైనా ఉద్యోగాలు ఉన్నాయి” అని ఆయన అన్నారు. అమెజాన్‌లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా 55000 టెక్నికల్, కార్పొరేట్ ఉద్యోగులు తమకు ఉన్నారని, నెట్‌వర్క్ కోసం మరో 125000 మందిని చేర్చుకుంటామని, భారత్‌లోని 35 నగరాల్లో 8000కుపైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని వర్చువల్ ఫైర్‌సైడ్ ఛాట్‌లో ఆయన తెలిపారు. వ్యూహాత్మకంగా ఉండే వారంటే తమకు ఇష్టమని, వివరాలను గొప్పగా, క్షుణ్ణంగా పరిశీలించే అభిరుచి కలిగిన వారు, కూలీకి పనిచేసేవారి కంటే ఉద్యమించి పనిచేసేవారంటేనే తమకు ఇష్టమని అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అమెజాన్‌కు భారత్ రెండో అతిపెద్ద సాంకేతిక కేంద్రంగా ఉంది. ఆ కంపెనీ టీమ్‌లో చాలా నైపుణ్యం ఉన్న సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, మెషిన్ లెర్నింగ్ సైంటిస్టులు, రీసెర్చ్ సైంటిస్టులు ఉన్నారు. 2025 నాటికి భారత్‌లో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించాలన్న లక్షం ఉన్నట్లు అమెజాన్ గతంలోనే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News