Wednesday, May 8, 2024

జగదాంబ, సేవాలాల్ మందిరాలతో తండాలకు నూతన కళ

- Advertisement -
- Advertisement -

జెకె తండాలో ఆలయ ప్రహరీ గోడ, కమ్యూనిటి హాల్‌కు భూమిపూజ చేసిన స్పీకర్

బాన్సువాడ: ఒకప్పుడు తండాలు వేరని, ప్రస్తుతం తండాల్లో జగదాంబ, సేవాలాల్ మందిరాల నిర్మాణంతో నూతన కళ సంతరించుకుంటుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని జెకె తాండ జగదాంబ, సేవాలాల్ మందిరాల ఆవరణలో రూ. 16 లక్షలతో నిర్మించే ప్రహరీ గోడ, కమ్యూనిటి హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ… తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. సీఎం కేసిఆర్ హయాంలో ప్రతి గ్రామం, తండాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష స్వాములు తండాల్లో మరింత భక్తి భావం పెంపొందిస్తున్నారన్నారు. తండాల్లో ఆలయాల నిర్మాణాలు, సౌకర్యాలకు నిధులను మంజూరు చేస్తున్నామని, ప్రతి తండాలో జగదాంబ, సేవాలాల్ ఆలయాలుండాలన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడిస్తే గ్రామాలు, తండాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, ఆత్మ కమిటి చైర్మన్ మోహన్ నాయక్, నాయకులు గోపాల్ రెడ్డి, అంజిరెడ్డి, బన్సీలాల్, జగ్రాం, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News