Wednesday, May 15, 2024

లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: వర్షాల వల్ల నగరంలోని ప్రజలకు ఇబ్బందులు రాకుండా నగరపాలక సంస్థ ముందస్తు భద్రత చర్యలు చేపడుతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన పలువురు ఉన్నాతాధికారులను ప్రభుత్వం జారీ చేసిన రేయిన్ అలర్ట్ పై అప్రమ త్తం చేశారు. గత వారం పది రోజులుగా ఎడ తెరపి లేకుండ కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగర వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం చేపట్టే సహాయ క చర్యల పై సూదీర్ఘంగా చర్చించి…సలహాలు సూచనలు చేస్తూ… ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మా ట్లాడుతూ…. కరీంనగర్ నగర వ్యాప్తంగా కురిసే వర్షాలతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ పలు విభాగాల అధికా రలు, సిబ్బంది, పారిశుధ్య కార్మీకులు మరియు 24 గంటలు సేవలందించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో గానీ రహదారుల్లో గానీ ఓపెన్ ఖాళీ స్థలాల్లో గానీ వరద నీటి సమస్యలుంటే ముందస్తు సహాయక చర్యలు చేప డుతున్నట్లు తెలిపారు.

మ్యాన్ వల్ తో పాటు అవసరమైన చోట యంత్రాల సహాయంతో కూడ సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఇంకా అప్రమత్తంగా ఉండాలని అధికార సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా ఎక్కడి బృందాలు అక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండాలని ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీస్కోవాలని ఆదేశించినట్లు తెలిపా రు. ఎక్కడైనా చెట్లు విరిగినా, విద్యుత్ స్థంబాలు పడిపోయినా, వరద నీటితో లో తట్టు ప్రాంతాలు మునిగిపోయినా, ఇండ్లలోకి నీరు చేరినా తక్ష ణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.

వర్షాభావ పరిస్థితి పై ఎప్పటికప్పుడు సిబ్బంది అదికారులు పర్యవేక్షణ చేస్తూ… ఉండాలన్నారు. ఖాళీ స్థలాల్లో గానీ ఇతర ప్రదేశాల్లో గానీ వరద నీరు నిలిస్తే…. కచ్చా కాలువల ద్వారా నీటి తొలగింపు చర్యలు చేపట్టారని ఆదేశించారు. నగరం లో ప్రస్తుతం 4 జేసీబీ యంత్రాలతో డీ వాటరింగ్ చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో 2 జేసీబీ యంత్రాలతో ఇబ్బందులు వస్తే…సరిపడా యం త్రాలు ఉండాలనీ ప్రత్యేకంగా మరో 2 జేసిబీ యంత్రాలను నూతనంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు.

అంతే కాకుండా డీ వాటరింగ్ చేసేందు కు మరో రెండు డిజిల్ మోటార్ పంపులను కొనిగోలు చేసేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. డిజీల్ మోటార్ పంపుల కొనుగోలు చేయా లని…వాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వర్షాల వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు, అసౌకర్యాలు క లగకుండా నగరపాలక సంస్థ అన్ని రకాల చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రజలను రక్షించడమే మా నగరపాలక సంస్థ ప్రధాన భాధ్యత అని ఆదిశగా ప్రతినిత్యం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News