Sunday, May 5, 2024

నెలవారీ కిస్తుల్లో స్పైస్‌జెట్ విమాన టెక్కెట్ల లభ్యత!

- Advertisement -
- Advertisement -

Spicejet

న్యూఢిల్లీ: చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సరిపోదని మిన్నకుండిపోతుంటారు. అయితే అలాంటి వారి కలను నిజం చేయడానికి ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ ఓ అద్భుత ఆఫర్‌ని ప్రకటించింది. విమాన టికెట్ల మొత్తాన్ని మూడు, ఆరు, పన్నెండు నెలల వ్యవధిలో చెల్లించుకునే సౌలభ్యం కల్పించనుంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారికి పాన్‌కార్డు, ఆధార్ కార్డు, విఐడి వంటివి ఉండాలి. అవి ఉంటేనే వన్‌టైమ్ పాస్‌వర్డ్ వారికి అందుతుంది. కాగా ప్రయాణికులు యూపిఐ ద్వారా తొలి కిస్తు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలవారీ కిస్తులు యూపిఐ నుంచి డిడక్ట్ అవుతాయి. ఇందుకు క్రెడిట్, డెబిట్ కార్డు వంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News