Thursday, May 2, 2024

కృష్ణమ్మ పరవళ్లు

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

 నాగర్జున సాగర్‌కు 79వేల క్యూసెక్కుల వరద
 గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం
 రెండు, మూడు ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్/భద్రాచలం: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో బుధవారం సాయంత్రం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి, నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందా రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తారు. దిగువ నాగార్జున సాగర్‌కు 79 వేల 131 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉ త్పత్తి కొనసాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 72 వేల క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం 885 అ డుగులకు గానూ ప్రస్తుతం 881.30 అడుగులకు చేరుకుంది. ఎగువ కర్ణాటక, జురాల, సుంకేసుల నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లను

ఎత్తే కార్యక్రమానికి ఆంద్రపదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావాల్సి ఉండగా ఆ రాష్ట్రా క్యాబినేట్ సమావేశం ఉండడంతో హాజరు కాలేదని సమాచారం. ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయానికి జురాల ప్రాజెక్టు నుండి 39 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 2లక్షల 92 వేల 794 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా జురాల జలవిద్యుత్ కేంద్రం ద్వారా మరో 21 వేల 432 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. సుంకేసుల జలాశయం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 53 వేల 228 క్యూసెక్కుల నీరు కలుపుకొని మొత్తం 3 లక్షల 67 వేల 454 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా జల విద్యుత్ కేంద్రానికి 31 వేల 62 క్యూసెక్కులు, తెలంగాణకు చెందిన ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా 40 వేల 259 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 215.807 టిఎంసీలకు గానూ 195.2102 టిఎంసీల నీరు నిల్వ ఉంది. జురాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ నుంచి 3 లక్షల 17 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరతుంది. అదే విధంగా కర్ణాటకలోని అలమట్టికి లక్షా 67 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ డ్యాంకు 2 లక్షల 45 వేల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యాంకు 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. అదే విధంగా నాగార్జున సాగర్‌కు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతుండగా పులిచింతల ప్రాజెక్టుకు 18 వేల 988 క్యూసెక్కులు, కృష్ణా డెల్టా సిస్టం(ప్రకాశం బ్యారేజ్)కి లక్షా 2 వేల 373 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఎగువ నుంచి వచ్చే వరద ఆదారంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశాలు ఉన్నాయి.

Srisailam Project 3 Gates lifted due to Heavy Floods

గోదావరి తగ్గుముఖం
భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఉధృతంగా ఉన్న ప్రవాహం మంగళవారం సాయంత్రానికి తగ్గుతూ వచ్చింది. ఎగువ నుంచి వరద తగ్గడంతో ఉదయం ఆరు గంటలకు రెండవ, మూడవ ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. గరిష్టంగా 61.4 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం ప్రజలను, అధికారులను ఆందోళనకు గురి చేసింది. నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 10 అడుగుల మేరకు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి 47.60 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రవాహం 43 అడుగుల వద్ద నిలకడగా ఉంది. వర్షాల కారణంగా గోదారి తగ్గుముఖం పట్టినా ఫ్లడ్‌రిలీఫ్ సెంటర్ల నుంచి బాధితులను ఇళ్లకు పంపడం లేదు.

ఆలయాలు బురదమయం

స్నానఘట్టాల వద్ద ఉన్న ఆలయాలు గోదావరి పట్టి జలమయం కాగా బుధవారం వరద తగ్గడంతో అవి బురదతో నిండుకున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు గోదారమ్మ విగ్రహం, పునర్వసు మండపాలను ఆలయ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. అలాగే కరకట్ట, స్నానఘట్టాల వద్ద పేరుకు పోయిన బురదను శుభ్రం చేయిస్తున్నారు. ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్ నేతృత్వంలో విస్తా కాంప్లెక్స్ వద్ద వరద నీటిని ప్రత్యేక పంపుల ద్వారా తోడి గోదావరిలోకి వదులుతున్నారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రహదారులను పునరుద్ధరించారు.

Srisailam Project 3 Gates lifted due to Heavy Floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News