Sunday, May 5, 2024

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(గురువారం) మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.90 పాయింట్లు లేక 0.21 శాతం తగ్గి 61431.74 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 51.80 పాయింట్లు లేక 0.28 శాతం తగ్గి 18129.95 వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్ షేర్లు ప్రధానంగా లాభపడగా, డివీస్‌ల్యాబ్, అదానీపోర్ట్, ఐటిసి, ఎస్‌బిఐఎన్, పవర్‌గ్రిడ్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఐటిసి మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. స్టాక్ విలువ 2.05 శాతం నష్టపోయి రూ. 418.85 వద్ద ట్రేడయింది.

ఇదిలావుండగా క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన ‘ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’(సెబీ) ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను మార్చాలని ప్రతిపాదించింది. లిస్టెడ్ కంపెనీలు స్టాక్ ప్రైస్‌ను ప్రభావితం చేసే విషయాలను వెల్లడించడంలేదు. స్టాక్ ఎక్సేంజీలతో నిర్వహించిన అధ్యయనంలో లిస్టెడ్ కంపెనీలు 8 శాతం మాత్రమే ప్రచురించని ధరసున్నితమైన సమాచారాన్ని(యుపిఎస్‌ఐ) సరిగ్గా వర్గీకరించాయని ‘సెబీ’ కనుగొంది. లిస్టెడ్ ఎంటిటీలు 92 శాతం సందర్భాలలో తప్పుగా ఉన్నాయని ఇది సూచిస్తుంది! కంపెనీల ఈ వైఫల్యం ఇన్‌సైడర్ ట్రేడింగ్ పద్ధతులను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోందని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది.
మార్కెట్ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు తగ్గి రూ. 82.59 వద్ద ట్రేడయింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 260.00 లేక 0.430 శాతం తగ్గి రూ. 60140 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News