Thursday, May 2, 2024

హకీంపేట క్రీడా పాఠశాలలో విద్యార్థుల ధర్నా

- Advertisement -
- Advertisement -

శామీర్ పేట : రాష్ట్ర క్రీడా పాఠశాలను అబాసుపాలు చేస్తున్నారని ఆ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకింపేట క్రీడా పాఠశాలలో విద్యార్థులు తన గేటు వద్ద బయట నుంచి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా పాఠశాల పేరు ప్రతిష్టన దెబ్బతీసేందుకే కొందరు కు ట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల క్రితం విద్యార్థిని పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో సస్పెండ్ అయిన ఓఎస్ డి హరికృష్ణఎటువంటి తప్పు చేయలేదు అతన్ని తిరిగి వెంటనే ఓఎస్ డి గా నియమించాలని డిమా ండ్ చేశారు. హరికృష్ణ వచ్చిన నాటి నుంచి క్రీడాపాఠశాల దినదిన అభివృద్ధి చెందిందని అది చూసి ఓర్వలేకనే ఆయనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారని వెంటనే దోషులను శిక్షించి న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ముం దుగా మూకుమ్మడిగా విద్యార్థులు గుమ్ముగూడి స్కూల్ మెయిన్‌బిల్డింగ్ నుంచి పరుగులు తీస్తూ రాజీవ్హ్రదారిని అనుకోని ఉన్న ప్రధాన గేటు వద ్దకు చేరుకొని రాజీవ్రహదారి బయటయించేందుకు ప్రయత్నించారు.శామీర్ పేట పోలీసులు అడ్డుకొని విద్యార్థులను ప్రధాన గేటు నుంచి బయటకు రాకుండా లోపలకు పంపారు. గేటు వద్ద విద్యార్థులు బయటాయించి తప్పు చేయని ఓ ఎస్ డి ని కుట్రపూరితంగా ఇరికించారని తిరిగి ఓ ఎస్ డి హరికృష్ణ ను వెంటనే రప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థులను సంజాయించి లోపలికి పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News