Tuesday, May 21, 2024

పదవీచ్యుత ప్రధానికి తిరిగి పదవి

- Advertisement -
- Advertisement -

Sudan's military agreed to reinstate ousted PM Abdullah Handok

సూడాన్‌లో సైన్యంతో నేతల డీల్

కైరో : సూడాన్‌లో బర్తరఫ్ అయిన ప్రధాని అబ్దాల్లా హందోక్‌ను తిరిగి పదవిలో నియమించేందుకు అక్కడి సైనిక అధికారులు సమ్మతించారు. ప్రజా ప్రభుత్వ స్థాపనకు వీలుగా సైన్యం, పౌర నేతల మధ్య ఓ కీలకమైన ఒప్పందం కుదిరింది. గత నెలలో జరిగిన సైనిక తిరుగుబాటులో ప్రధాని పదవీచ్యుతులు అయ్యారు. తిరిగి ప్రధానిని అధికారంలో ప్రతిష్టించేందుకు డీల్ కుదిరిన విషయాన్ని ఆదివారం ఇరుపక్షాలు నిర్థారించాయి. అక్టోబర్ 25వ తేదీన జరిగిన తిరుగుబాటు దశలో అరెస్టు అయిన ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలను విడుదల చేయడం జరుగుతుందని సైనికాధికారులు ప్రకటించారు. అయితే ఇప్పుడు కుదిరిన డీల్‌ను తాము అంగీకరించడం లేదని అతి పెద్ద రాజకీయ పార్టీ ఉమ్మాపార్టీ తెలిపింది. ఇక దేశంలోని ఇండిపెండెంట్ టెక్నోక్రాటిక్ కేబినెట్‌కు హందోక్ తిరిగి సారథ్యం వహిస్తారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News