Tuesday, April 30, 2024

ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్టు… కాపాడిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రైల్వే పోలీసులు అతడిని రక్షించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లింగేశ్వర్(41) అనే యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. రైల్వే కోడూరులో రాంనగర్‌కు చెందిన లింగేశ్వర యాదవ్ 11 సంవత్సరాల క్రితం ఓ యువతితో పెళ్లి జరిగింది. ఆమె కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతుండడంతో ఆమె తన భర్త, అత్తింటి సభ్యులపై వరకట్నపు వేధింపుల కింద స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లింగేశ్వర్ యాదవ్ కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగిన వీళ్లు కాపురం చేయడానికి ససిమేరా అనలేదు. భార్య తన అనుచురులతో భర్త ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా అభరణాలు, విలువైన వస్తువులను తీసుకెళ్లింది. భార్యను నిలదీసేందుకు లింగేశ్వర్ యాదవ్ ఏప్రిల్ 17న తిరుపతికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ… తాను చనిపోతున్నానని అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి మొబైల్ నంబర్ ఆధారంగా ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. ఓ లాడ్డిలో నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News